ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- February 28, 2026
కువైట్: కువైట్ లోని ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్లు, డిస్పెన్సరీలు, ప్రయోగశాలలు, గృహ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, అన్ని లైసెన్స్ పొందిన ప్రైవేట్ వైద్య సంస్థలు సహా అన్ని ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు నిషేధం వర్తిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వైద్య సేవా రుసుములను ఆమోదించిన బ్యాంకింగ్ మరియు ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక లావాదేవీలపై సరైన డాక్యుమెంటేషన్ను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు









