విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- March 01, 2026
అబుదాబి: ఎయిర్ స్పేస్ మూసివేయడం కారణంగా విమానయాన రంగం షట్ డౌన్ అయిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) తెలిపింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించడానికి కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఫ్లైట్ షెడ్యూళ్లను క్రమంగా తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ క్యారియర్‌లు సమన్వయంతో పనిచేస్తున్నాయని అథారిటీ పేర్కొంది. దేశంలోని విమానాశ్రయాల మధ్య కొన్ని విమానాలను నడపడం, రీషెడ్యూలింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం మరియు ప్రయాణికుల రద్దీని పరిష్కరించడానికి ప్రయాణీకుల టెర్మినల్‌లలో ఆన్-గ్రౌండ్ సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటివి తమ కార్యచరణ ప్రణాళికలో ఉన్నాయని అథారిటీ తెలిపింది.
చిక్కుకుపోయిన ప్రయాణీకులకు అన్ని రకాల హోస్టింగ్ మరియు వసతి ఖర్చులను స్టేట్ భరిస్తుందని GCAA ప్రకటించింది. దేశంలోని విమానాశ్రయాలు మరియు జాతీయ విమానయాన సంస్థలు కొన్ని విమానాల రీషెడ్యూల్ ద్వారా ప్రభావితమైన సుమారు 20,200 మంది ప్రయాణికులకు తగిన సేవలు అందించినట్లు తెలిపింది. రీబుకింగ్ విధానాలను సులభతరం చేయడంతో పాటు, భోజనం మరియు రిఫ్రెష్‌మెంట్‌లతో పాటు తాత్కాలిక వసతిని అందిస్తున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని GCAA ప్రయాణికులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







