ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- March 01, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఖమేనీ తన జీవితకాలంలో అధికారిక వారసుడిని ప్రకటించకపోవడంతో, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం కొత్త నాయకుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మోజటబ ఖమేనీ— ఖమేనీ కుమారుడు. తండ్రికి అత్యంత విశ్వసనీయుడిగా, తెరవెనుక రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. అయితే అధికారం వారసత్వంగా ఇవ్వడాన్ని ఇరాన్ ప్రజలు, మతపెద్దలు ఎంతవరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు హస్సన్ ఖమేనీ పేరు కూడా ముందుకు వస్తోంది. ఆయన ఇస్లామిక్ విప్లవ నేత అయతుల్లా ఖొమేనీ మనవడు కాగా, మతపెద్దలలో మంచి గుర్తింపు కలిగి ఉన్నారు.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే బాధ్యత “Assembly of Experts” కు చెందుతుంది.88 మంది అగ్రశ్రేణి మత పండితులు చర్చించి కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. అయితే కేవలం మతపెద్దల నిర్ణయం మాత్రమే కాకుండా, ఇరాన్ సైనిక శక్తి అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మద్దతు కూడా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ బలగం ఎవరికి మద్దతు ఇస్తే వారికి అధికారం దక్కే అవకాశాలు పెరుగుతాయి.
ఇటీవలి దాడుల్లో IRGC కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్ మరణించాడనే వార్తల నేపథ్యంలో సైన్యంలోనూ నాయకత్వ మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజీష్కియాన్ పరిస్థితి కూడా స్పష్టంగా లేదనే సమాచారం వెలువడుతోంది. దేశ నాయకత్వం తాత్కాలిక అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ పదవి మతపరమైన పండితుడే చేపట్టాలి. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సైన్యం ప్రభావం కూడా కీలక పాత్ర పోషించే అవకాశముంది. రాబోయే గంటలు, రోజులు ఇరాన్ భవిష్యత్తు దిశను నిర్ణయించనున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







