ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- March 01, 2026
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతున్న వేళ, ఆ దేశ సుప్రీం నాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గడ్డ పై అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగంగా గుర్తింపు పొందిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) కు కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌ను నియమించింది. సీనియర్ అధికారి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీని ఈ అత్యున్నత పదవిలో నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శనివారం జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ మరణించినట్లు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.అహ్మద్ వాహిదీకి సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, వ్యూహరచనలో నిపుణుడైన వాహిదీ నియామకం ద్వారా సైనిక బలగాల్లో ఐక్యతను తీసుకురావాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







