పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- March 01, 2026
టీ20 ప్రపంచ కప్ 2026 లో పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. సెమీస్ కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉంది. అయితే, అందులో పాక్ విఫలమైంది.
సూపర్-8లో భాగంగా పల్లెకలె వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. కీలక మ్యాచ్ లో పాక్ చెలరేగింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీతో చెలరేగాడు. 59 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. పాక్ మరో ఓపెనర్ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లోనే 84 రన్స్ చేశాడు. 4 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.
భారీ స్కోర్ చేయడంలో పాక్ సక్సెస్ అయినా.. శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దాంతో ఈ మ్యాచ్ లో పాక్ గెలిచినా ఎందుకూ పనికి రాకుండా పోయింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ తో పాటు న్యూజిలాండ్ సెమీస్ చేరింది. 3 పాయింట్లు, నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో సెమీస్ కు అర్హత సాధించింది కివీస్ జట్టు
ఈ మ్యాచ్ లో పాక్ కేవలం 5 రన్స్ తేడాతో లంకపై గెలిచింది. 213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. పాక్ ను ఓడించినంత పని చేసింది. అయితే 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మరీ ముఖ్యంగా శనక విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే 76 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సులు ఉన్నాయి. శనక సృష్టించిన విధ్వంసంతో ఈ టోర్నీలో పాక్ ఖేల్ ఖతమైంది
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







