ఆప్ఘనిస్తాన్ రాజధాని లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం..
- July 31, 2016
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని పూల్-ఏ-చర్కి ప్రాంతంలోని ఫారెన్ గెస్ట్ హౌస్ నార్త్ గేట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఆదివారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడు.. కాబూల్ మొత్తం వినిపించిందని స్థానికులు మీడియాతో వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే నంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేటుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును పేల్చేసిన అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.కాబూల్ లో గత వారం ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 80 మంది మృతి చెందగా.. 230 మంది గాయపడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







