ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్‌దాన్‌కు ఫోన్ కాల్

- March 01, 2026 , by Maagulf
ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్‌దాన్‌కు ఫోన్ కాల్

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అయిన షేక్ హమ్‌దాన్‌ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కి ఖతార్ రక్షణ వ్యవహారాల రాష్ట్ర మంత్రి టెలిఫోన్ కాల్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు మరియు రక్షణ సహకారంపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకుని, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాల పై దృష్టి సారించినట్లు వెల్లడించారు.

ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతను కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇరు నాయకులు పునరుద్ఘాటించినట్లు తెలిసింది. ఈ సంభాషణ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com