గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- March 02, 2026
అమరావతి: గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (AP NRTS) కో-ఆర్డినేటర్ల ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, నివాసం, ప్రాథమిక అవసరాల ఏర్పాట్లతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే ఏపీ NRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్ 0863-2340678 కు సంప్రదించవచ్చని, అలాగే వాట్సాప్ ద్వారా +91 85000 27678 నంబర్‌కు సమాచారం పంపవచ్చని మంత్రి సూచించారు. అదేవిధంగా [email protected] ఈమెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతి తెలుగు పౌరుడి భద్రతకు కట్టుబడి ఉందని, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రోన్ శకలాలు పడిపోవడంతో ఎటువంటి గాయాలు కాలేదు
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్‌లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్‌లో భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు









