జూన్‌లో భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- March 02, 2026
న్యూ ఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో అఫ్గాన్ జట్టు ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.
జూన్ 6 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుండగా..జూన్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, చెన్నై లలో అఫ్గాన్ జట్టు ఆడనుంది.
భారత దేశంలో అఫ్గానిస్థాన్ పర్యటన షెడ్యూల్ ఇదే..
- ఏకైక టెస్టు మ్యాచ్ – జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్ వేదికగా
వన్డే సిరీస్ షెడ్యూల్..
- తొలి వన్డే – జూన్ 14న (ధర్మశాల)
- రెండో వన్డే – జూన్ 17న (లక్నో)
- మూడో వన్డే – జూన్ 20న (చెన్నై)
వన్డే మ్యాచ్‌లు అన్ని డే అండ్ మ్యాచ్‌లు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







