ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
- March 02, 2026
హైదరాబాద్: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడి తమ సంతాపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేతబూని, మతపరమైన నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, జమ్మూ-కశ్మీర్ మరియు శ్రీనగర్‌లలో కూడా నిరసనలు మిన్నంటాయి. షియా వర్గీయులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతి తమ వర్గానికి తీరని లోటని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమేనీ మృతి నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించింది. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకుని, నలుపు రంగు దుస్తులు ధరించి మౌన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అధికారులు ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







