యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- March 02, 2026
అబుదాబి: యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ప్రకటించింది. డేటా సెంటర్‌పై కొన్ని వస్తువులు పడటంతో చిమ్మర్లు చెలరేగి మంటలు చెలరేగినట్లు కంపెనీ వెల్లడించింది.
మార్చి 1న ఉదయం 5:19 గంటలకు (PST) విడుదల చేసిన హెల్త్ డ్యాష్‌బోర్డ్ అప్డేట్లో, ME-CENTRAL-1 రీజియన్‌లోని ఒకే ఒక్క అవైలబిలిటీ జోన్ (mec1-az2)లో స్థానిక విద్యుత్ సమస్య కారణంగా APIలు మరియు ఇన్స్టాన్స్లకు కనెక్టివిటీ, పవర్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.
తదుపరి అప్డేట్లో, సుమారు ఉదయం 4:30 గంటల (PST) సమయంలో mec1-az2 అవైలబిలిటీ జోన్‌పై వస్తువులు పడటంతో మంటలు చెలరేగాయని తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో డేటా సెంటర్‌కు మరియు జనరేటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని వెల్లడించింది.
“విద్యుత్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాం. అనుమతి లభించిన వెంటనే సురక్షితంగా పవర్ మరియు కనెక్టివిటీని పునరుద్ధరిస్తాం. ప్రభావిత అవైలబిలిటీ జోన్లో సేవలు పూర్తిగా పునరుద్ధరించేందుకు కొన్ని గంటలు పట్టవచ్చు. ఇతర అవైలబిలిటీ జోన్లు సాధారణంగా పనిచేస్తున్నాయి,” అని సంస్థ తెలిపింది.
అదనంగా, కొంతమంది వినియోగదారులు EC2 APIలలో, ముఖ్యంగా నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన APIలు (AllocateAddress, AssociateAddress, DescribeRouteTable, DescribeNetworkInterfaces) వినియోగంలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు AWS తెలిపింది. సమస్యలను పరిష్కరించేందుకు పలు మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
మార్చి 2 ఉదయం వరకు విద్యుత్ పునరుద్ధరణకు ఖచ్చితమైన సమయం (ETA) తెలియదని కంపెనీ వెల్లడించింది. వీలైతే వినియోగదారులు ప్రత్యామ్నాయ అవైలబిలిటీ జోన్లు లేదా ఇతర AWS రీజియన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.
తదుపరి అప్డేట్లో ME-CENTRAL-1 రీజియన్‌లో అదనపు కనెక్టివిటీ సమస్యలు మరియు లోపాల రేట్లపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు AWS తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్‌లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్‌లో భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు









