వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నా మున్నాభాయ్ ..
- July 31, 2016
'పీకే' సినిమా తర్వాత వెండితెరకు దూరమైన బాలీవుడ్ 'మున్నాభాయ్' సంజయ్‌దత్.. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్, విధు వినోద్ చోప్రాల దర్శకత్వంలో రెండు సినిమాలు చేసేందుకు సంజయ్ ఒప్పుకున్నారు. ఈ రెండు 2017లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే.. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించనున్న 'మున్నాభాయ్-3' చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది 2018లో రానుంది. ఇదిలా ఉండగా.. తన తదుపరి చిత్రంలోనూ సంజయ్ దత్ నటిస్తారని దర్శకుడు మహేశ్ ముంజ్రేకర్ తాజాగా ప్రకటించారు.
2008లో సూపర్ హిట్‌గా నిలిచిన మరాఠీ చిత్రం 'దే ధక్కా'ను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు మహేశ్ ముంజ్రేకర్ వెల్లడించారు. అందులో సంజయ్ దత్.. 43- 44ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో నటిస్తారని తెలిపారు. పూర్తిగా కుటుంబ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో పంజాబీ వ్యక్తిగా.. కాస్త భిన్నమైన లుక్‌లో మున్నాభాయ్ కనిపించనున్నారట.
ప్రస్తుతం ఇందులో సంజయ్‌దత్‌కు భార్యగా నటించేందుకు కథానాయిక కోసం వెతుకుతున్నామని దర్శకుడు తెలిపారు. కొడుకు, కూతురు పాత్రల కోసం కొత్తవారిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆగస్టులో విడుదల చేయనున్నట్లు మహేశ్ తెలిపారు.
మరోవైపు.. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సంజయ్ బయోపిక్ కూడా 2017లో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ మున్నాభాయ్.. గెస్ట్ రోల్ పోషించే అవకాశం ఉందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 2017లో తన అభిమానులకు సంజయ్ వినోదపు విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







