ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని : చంద్రబాబు

- July 31, 2016 , by Maagulf
ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని : చంద్రబాబు

ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిముషాల పని అన్నారు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ కి హోదా పై తమ పార్టీ నేతలతో సుదీర్ఘంగా ఆయన చర్చించారు. హోదా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బీజెపీ తోఅమీతుమీ తేల్చుకుంటామని మీడియా వద్ద మాట్లాడిన ఆయన-తమ పార్టీ నాయకులతో జరిపిన సమావేశంలో మాత్రంఆ దూకుడు చూపకపోవడం విశేషం. ఎవరితోనూ యుద్ధం చేయాలన్న ఆలోచన తనకు లేదని, ప్రధాని మోదీ స్పందనను బట్టి కొన్ని రోజులు వేచి చూసి కార్యాచరణ కు పూనుకొందామని చంద్రబాబు చెప్పారు.మీరు ఆదేశిస్తే రాజీనామాకు మేము సిద్ధం అని కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వ్యాఖ్యానించగా..ఇప్పుడే దీనిపై మాట్లాడవద్దని బాబు అన్నారు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించను..అయితే హోదా ఇస్తామన్న బీజెపీ నాయకత్వ హామీని ఆ పార్టీ నేతలకే గుర్తు చేద్దాం అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com