విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- March 03, 2026
యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యలో గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేసులను మూసివేసిన సంగతి తెలిసింద. దీంతో విదేశాలలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు బోర్డింగ్ పాస్‌లను పట్టుకుని, ఎయిర్‌లైన్ యాప్‌లను రిఫ్రెష్ చేస్తూ, హోటళ్ళు మరియు విమానాలను తిరిగి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్లీ ఫ్లైట్స్ రద్దు చేయబడ్డాయి అని మెసేజ్ చూడగానే నిట్టూర్చుతున్నారు. దీంతో కొందరు అనిశ్చితిని ఎదుర్కొంటుండగా, మరికొందరు అసౌకర్యానికి గురవుతున్నారట.
ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలలో యూఏఈకి వచ్చే ప్రయాణీకులు చేరుకోవడానికి మార్గం లేక నిరాశ చెందుతున్నారు. “నా ఎయిర్‌లైన్ సమాచారం అందించలేదు. మేము బాకు విమానాశ్రయంలో 11 గంటలకు పైగా ఉన్నాము. ఎయిర్‌లైన్ ప్రతినిధులు అందుబాటులో లేరు. మేము మాట్లాడిన అన్ని విమానాశ్రయ అధికారులు కూడా తమకు సమాచారం లేనందున సహాయం చేయలేమని చెప్పారు. మేము ఎయిర్‌లైన్ కాల్ సెంటర్‌ను సంప్రదించడానికి, ఇమెయిల్ చేయడానికి, AI ఏజెంట్లకు మెసేజులు పంపడానికి ప్రయత్నించాము. ”అని తెల్లవారుజామున 2 గంటలకు Airbnbలో చెక్ ఇన్ చేసిన ఆనీ ఫెర్నాండెజ్ తెలిపారు.
అలాగే, ఓ యూఏఈ జంట బాకులో వెకేషన్ కు వెళ్లి చిక్కుకుపోయారు. అయితే, అక్కడి నుంచి వారు భారత్ వెళ్లాలని ప్రయత్నించారు. కాగా, భారత్ కు డైరెక్ట్ విమానాలు బుక్ అయిపోయాయని తెలుసుకున్న తర్వాత, తాను మరియు తన భర్త మొదట అనుకున్న దానికంటే ఐదు అదనంగా తమ రెసిడెన్సీని పొడిగించాల్సి వచ్చిందని ఆ జంట చెప్పారు. "ధరలు రెట్టింపు కంటే పెరిగాయి" అని ఆమె చెప్పారు. తాము ఇంతకు ముందు Dh750కి చూసామని, ఇప్పుడు ఒక్కొక్కరికి Dh1,600కి పైగా ఖర్చవుతోందని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ Airbnb ధరలు సహేతుకంగా కనిపిస్తున్నాయని, రాత్రికి Dh150కి మంచి ధరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కానీ ఖర్చులు పెరుగుతున్నాయని, కాబట్టి యూఏ విమానాలు త్వరగా తెరుచుకుంటాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
గత 11 సంవత్సరాలుగా యూఏఈలో ఉంటున్న హర్‌ప్రీత్ సింగ్, స్నేహితులతో కజకిస్తాన్‌లోని అల్మట్టికి వెకేషన్ కోసం వెళ్లి చిక్కుకుపోయాడు. దుబాయ్‌కు తిరిగి వెళ్లాలని అనుకున్నా సాధ్యం కావడం లేదని తెలిపాడు. తాము హోటల్ రూమ్ ను పొడిగిస్తూ వస్తున్నామని, వారు ఇదే అదనుగా గదికి Dh300 వసూలు చేస్తున్నారని వాపోయాడు. అదనపు ఖర్చులు భారీగా పెరిగాయని అన్నారు. తాను ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉన్నానని, మార్చి 8 వరకు దుబాయ్‌కి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్లు సింగ్ వివరించారు.
ఇదే సమయంలో ఇండియాకు వెళదామంటే కొన్ని విమానాలు మాత్రమే ఉన్నాయని, టిక్కెట్ ధరలు దిర్హామ్‌లు 1,000-1,500 వరకు పెరిగాయని తెలిపాడు. ఇక తన స్నేహితురాళ్ళలో ఒకరు భారతీయ సంతతికి చెందినవారు ఉన్నా.. ఆమెకు పోర్చుగీస్ పాస్‌పోర్ట్ ఉంది. ఆమె ఇండియాకు రావాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అనేక విషయాలు చాలా అస్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్‌కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్







