దుబాయ్‌ సఫారీ పార్క్‌లో 1000 సీట్ల థియేటర్‌

- August 01, 2016 , by Maagulf
దుబాయ్‌ సఫారీ పార్క్‌లో 1000 సీట్ల థియేటర్‌

దుబాయ్‌ సఫారీ ప్రాజెక్ట్‌ మెయిన్‌ బిల్డింగ్‌ కోసం 151 మిలియన్‌ దిర్హామ్‌లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి దుబాయ్‌ డిప్యూటీ రూలర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ దుబాయ్‌ మునిసిపాలిటీ షేక్‌ హమదాన్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆమోదం తెలిపారు. దుబాయ్‌ మునిసిపాలిటీ ఈ మెయిన్‌ బిల్డింగ్‌కి సంబంధించి ఓ ఇమేజ్‌ని కూడా విడుదల చేసింది. 1 బిలియన్‌ ఖర్చుతో రూపొందనున్న ఈ సఫారీ ప్రాజెక్ట్‌ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుంది. సఫారీకి 3.7 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌ వుంటుంది. ఇందులో 10,500 జంతువులు, పక్షులు, 350 ప్రత్యేకమైన, అంతరించిపోతున్న జీవులు ఇందులో కొలువుదీరతాయి. 75 శాతం ప్రాజెక్ట్‌ పనులు దాదాపు పూర్తయిపోయాయని ఇటీవలే మునిసిపాలిటీ ప్రకటించింది. మెయిన్‌ బిల్డింగ్‌లో ఓ థియేటర్‌ వెయ్యి సీట్ల కెపాసిటీతో అందుబాటులోకి రానుంది. సోలార్‌ పవర్‌తో, స్మార్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నామనీ, ఎకో ఫ్రెండ్లీగా పార్క్‌ని తీర్చిదిద్దుతామని అధికారులు వెల్లడించారు. మొత్తం 3,600 పార్కింగ్‌ స్లాట్స్‌తో పర్యాటకులకు ఈ పార్క్‌ వినూత్నమైన అనుభూతిని కలిగిస్తుందని వారు వివరించారు. అరబ్‌ విలేజ్‌, ఆఫ్రికన్‌ విలేజ్‌, ఓపెన్‌ సఫారీ విలేజ్‌, వాలీ ఏరియా, వాడి ఏరియా అనే ముఖ్యమైన భాగాలు దుబాయ్‌ సఫారీలో ఉంటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com