సౌదీ లెయిడ్‌ ఆఫ్‌ వర్కర్స్‌కి భారత్‌ బాసట

- August 01, 2016 , by Maagulf
సౌదీ లెయిడ్‌ ఆఫ్‌ వర్కర్స్‌కి భారత్‌ బాసట

భారత విదేశాంగ శాఖ, సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడ్డ భారతీయుల్ని ఆదుకుంటామని ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. రియాద్‌లోని ఇండియన్‌ ఎంబసీ, లెయిడ్‌ ఆఫ్‌ వర్కర్లకు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోందని చెప్పారామె. అలాగే, సౌదీ అరేబియాకి వెళ్ళి, అక్కడి నుంచి కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకొచ్చేందుకు వీలుగా మంత్రిత్వ శాఖ తరఫున అధికారుల్ని పంపుతున్నట్లు ఆమె వివరించారు. బాధిత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా సౌదీలో నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా సౌదీ అరేబియాలో కన్‌స్ట్రక్షన్‌ రంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ కారణంగా 10000 మందికి పైగా ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారు. సౌదీలో వారి దీన పరిస్థితులపై సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఈ విషయం మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్ళడంతో, మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com