అజిత్ చిత్రంలో ముగ్గురు కథానాయికలు!
- July 31, 2016
తమిళ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పేరును ఖరారు చేయగా.. మరో ఇద్దరు నటీమణుల కోసం చిత్రం బృందం అన్వేషిస్తోందని తెలిసింది.ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్న అజిత్‌కు కాజల్ భార్యగా నటించనుంది. వీళ్లకు సూటయ్యేలా మరో కథానాయిక కోసం చిత్రబృందం వెతుకుతోందట. మూడో హీరోయిన్ అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే.. రెండో కథానాయికగా నటుడు కమల్‌హాసన్ కూతురు అక్షర హాసన్‌ను తీసుకున్నట్లు వూహాగానాలు వస్తున్నాయి. .ఇప్పటికే చిత్రబృందం పలువురు కథానాయికలను సంప్రదించిందని.. అందులో ఎవరనేది ఫైనలైజ్ చేయాల్సి ఉందని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం బల్గేరియాలో ప్రారంభం కానుందట.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







