అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్‌ క్లారిటీ..!!

- March 04, 2026 , by Maagulf
అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్‌ క్లారిటీ..!!

యూఏఈ: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది.  ఈ ఘటనలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, వాటిని రెస్క్యూ టీమ్స్ ఆర్పివేశారని దుబాయ్ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్  కంటెంట్ ను నమ్మొద్దని కోరింది.  ఎమర్జెన్సీ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయవద్దని, వాటిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయవద్దని తెలిపింది.

ఇరాన్ ఇప్పటివరకు ప్రయోగించిన 186 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, 172 క్షిపణులు ధ్వంసం చేశామని తెలిపింది.  వాటిలో 13 సముద్రంలో పడ్డాయని, ఒక క్షిపణి  భూభాగంపై పడిందని తెలిపింది. అలాగే, 812 ఇరానియన్ డ్రోన్‌లను గుర్తించామని, 755 డ్రోన్‌లను కూల్చివేశామని, 57 దేశ భూభాగంలోకి పడ్డాయని వెల్లడించారు. ఇంకా, 8 క్రూయిజ్ క్షిపణులను గుర్తించి డెస్ట్రాయ్ చేశామని, దీనివల్ల కొంత నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో  పాకిస్తానీ, నేపాల్ మరియు బంగ్లాదేశ్ జాతీయులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.

అలాగే, ఎమిరాటీ, ఈజిప్షియన్, ఇథియోపియన్, ఫిలిప్పీన్స్, పాకిస్తానీ, ఇరానియన్, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్‌బైజాన్, యెమెన్, ఉగాండా, ఎరిట్రియన్, లెబనీస్ మరియు ఆఫ్ఘన్ జాతీయులలో 68 మందికి స్వల్ప గాయాలు అయినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com