1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ

- March 04, 2026 , by Maagulf
1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ

యూఏఈ: ఇరాన్ తన వైఖరి మార్చుకోవడం లేదని యూఏఈ అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఇప్పటివరకు 1,000 కి పైగా దాడులు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  ఇతర దేశాల కంటే యూఏఈ నే ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొంది.

"యూఏఈ వెయ్యికి పైగా దాడులకు గురైంది. ఈ సంఖ్య ఇతర అన్ని దేశాలు ఎదుర్కొన్న దాడుల మొత్తాన్ని మించిపోయింది. మన సాయుధ దళాలు ఈ దాడులకు అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో ఎదుర్కొంది." అని వెల్లడించింది.

యూఏఈ యుద్ధంలో పాల్గొనలేదని, ఇరాన్‌పై జరిగిన ఏ దాడిలోనూ తన భూభాగం, ప్రాదేశిక జలాలు లేదా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని గుర్తుచేసింది.ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ఉద్రిక్తతలను తగ్గించే విధానాలకు యూఏఈ మద్దతు ఇస్తుందని మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com