శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు ..
- August 01, 2016
అన్నాడీఎంకేకు చెందిన రాజ‍్యసభ సభ్యురాలు శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు వేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే.. రాజీనామా చేయడానికి తిరస్కరించిన శశికళ.. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడమే కాక, అక్కడ కన్నీరు కూడా పెట్టారు.ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను.. అన్నాడీఎంకే ఎంపీ శశికళ చెంపమీద కొట్టిన విషయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే. పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఢిల్లీ ఎయిర్ పోర్టులో వ్యవహరించారంటూ శశికళపై జయలలిత మండిపడ్డారు. ఆదివారం నాడు పోయస్ గార్డెన్స్ కు వెళ్లి వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







