రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని సయ్యద్ సలాహుద్దీన్
- August 01, 2016
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న భారత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భద్రత పట్ల ఆ దేశమే బాధ్యత వహిస్తుందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. సార్క్ సమావేశాల కోసం ఈ వారంలో రాజ్‌నాథ్ ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆదివారం లాహోర్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహించిన ర్యాలీలో ఆ సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్మాట్లాడుతూ.. రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. రాజ్‌నాథ్ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది.రాజ్‌నాథ్ పాక్‌కు రాకుండా అడ్డుకోవాలని పాక్ ప్రభుత్వానికి సయ్యద్ హెచ్చరికలు చేశాడు. కశ్మీర్లో సైన్యాన్ని మోహరింపజేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని భద్రతాదళాలు హతమార్చినప్పటి నుంచి కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీందో భారత్, పాక్‌ల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ పాకిస్థాన్ పర్యటన కూడా ఉద్రిక్తతకు దారితీస్తోంది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







