ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!

- March 05, 2026 , by Maagulf
ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!

దుబాయ్: ఫైర్ వర్క్స్ వినియోగంపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఫైర్ వర్క్స్ కలిగి ఉండటం లేదా వ్యాపారం చేయడం ప్రాణాలకు, ఆస్తికి మరియు సమాజంలో వాటి వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాల గురించి సోషల్ మీడియా పోస్టులో ప్రజలకు దుబాయ్ పోలీసులు గుర్తు చేశారు.

యూఏఈలో అమల్లో ఉన్న చట్టాలను గౌరవించాలని కోరారు. ప్రజలు 901 కాల్ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా ఏవైనా కేసులను నివేదించాలని కోరారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా లేదా వినియోగించినా జరిమానా కింద సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు Dh100,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.      

షార్జా పోలీసులు ఇటీవల 18,670 అక్రమ ఫైర్ వర్క్స్ వస్తువలను కలిగి ఉన్న వ్యక్తిని ఇటీవల అరెస్టు చేశారు. 2019 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 17లోని ఆర్టికల్ 54 ప్రకారం అనుమతి లేని ఫైర్ వర్క్స్ వ్యాపారం యూఏఈలో నేరంగా పరిగణిస్తారు.  లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, దిగుమతి చేసుకున్నా, ఎగుమతి చేసినా, తయారు చేసినా లేదా తీసుకువచ్చే ఎవరైనా చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీసులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com