వాహనదారులకు ఊరట
- March 06, 2026
న్యూ ఢిల్లీ: దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెరదించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి.
ముడి చమురు పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ప్రభుత్వం వివరించింది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, దీనివల్ల దేశీయ మార్కెట్లలో ధరల స్థిరత్వం ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదురైనా తట్టుకునేలా భారత్ తగినంత మేర చమురు రిజర్వులను కలిగి ఉందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్ మరియు ఆయిల్ సరఫరాకు ఏవైనా అంతరాయాలు ఏర్పడినా దేశానికి ఇబ్బంది ఉండదని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళికలతో తగినంత నిల్వలను సిద్ధం చేసుకున్నందున, వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









