భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ సుష్మాస్వరాజ్‌..

- August 01, 2016 , by Maagulf
భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ సుష్మాస్వరాజ్‌..

సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామనీ, వారికి పరిహారం అందించేందుకు కృషి చేస్తామనీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు.
సోమవారం పార్లమెంటు సమావేశంలో అమె మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం సౌదీకి వెళ్లి అక్కడ ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో, ఆకలితో బాధపడుతున్న వేలమందికి భారత కాన్సులేట్‌, జెడ్డాలో ఆహారాన్ని అందిస్తోందని చెప్పారు. గత కొన్ని నెలలుగా జీతాలు అందుకోని ఉద్యోగులందరికీ వారికి దక్కాల్సిన మొత్తం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్‌ వచ్చే వారం సౌదీ అరేబియాకు వెళ్లి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారతీయ కార్మికులకు సాయం చేయనున్నట్లు ఆమె తెలిపారు.చమురు ధరల పతనంతో ఏడాది కాలంగా అక్కడి ప్రభుత్వం ఖర్చుపై కోత వేసింది. దీంతో ప్రభుత్వ కాంట్రాక్టులపై ఆధారపడి నిర్మాణ కార్యకలాపాల్ని కొనసాగించే సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ కారణంగా సౌదీ అరేబియాలోని పలు ఫ్యాక్టరీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతభత్యాలను ఇవ్వలేకపోతున్నాయని సుష్మా వివరించారు. ఈ కారణంగానే సుమారు పదివేల మంది ఆహారం కూడా లభించక ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com