ఎక్కువ మొత్తంలో హెరాయిన్ స్మగ్లింగ్
- August 01, 2016
స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన 13మందిని సోమవారం పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 60మిలియన్ల విలువ చేసే 6కిలోల హెరాయిన్‌ను దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నించిన వీరు పాక్ పోలీసులకు చిక్కారు. అధికారుల వివరణ ప్రకారం.. శనివారం పాక్ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లాల్సిన పీఐఏ పీకే-203 విమానం బయలుదేరుతుండగా, ఎక్కువ మొత్తంలో హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం అందుకున్న మాదక ద్రవ్యాల వ్యతిరేక దళ(ఏఎన్‌ఎఫ్) సిబ్బంది అక్కడకు చేరుకుంది. రెండు గంటల తనిఖీ అనంతరం ఎయిర్‌పోర్టులోని శౌచాలయంలో లభించిన రూ.60మిలియన్లు విలువ చేసే 6కిలోల హెరాయిన్‌ను ఏఎన్‌ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై దర్యాప్తు అనంతరం 13మంది పీఐఏ సిబ్బందిని అధికారులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
గల కొద్ది సంవత్సరాల్లో మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, మొబైల్ ఫోన్లు, అక్రమ పాస్‌పోర్టులు, డబ్బు తదితర వాటిని తరలిస్తూ పట్టుబడ్డ నిందితుల్లో పీఐఏ సిబ్బంది అధిక సంఖ్యలో ఉన్నారు. తమ దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా పీఐఏ సిబ్బంది స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







