వర్క్ షాప్ లో అగ్నిప్రమాదం
- August 01, 2016
మనామా: సల్మాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ఒక వడ్రంగి కర్మాగారంలో ఆదివారం జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదంలో పలు సామాగ్రి ధ్వంసం కాబడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు ఇప్పటివరకు లేవని సమాచారం నివేదించబడింది.అంతర్గత వ్యవహారాల శాఖ పౌర రక్షణ అగ్నిమాపక బృందాలు మంటలు వేరే ప్రాంతానికి వ్యాపించకుండా విజయవంతంగా నిలువరించారని ఈ సంఘటన గూర్చి ధ్రువీకరించారు.పదిహేడు సివిల్ డిఫెన్స్ వాహనాలు మరియు 60 మంది అగ్నిమాపక సిబ్బంది ఉవెత్తున లేచిన మంటలను నియంత్రించడానికి మరియు వేరే ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందకుండా నిలవరించారని మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.సివిల్ రక్షణ జనరల్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ శౌరిటర్ ధ్రువీకరించారు "అగ్నిప్రమాదం జరగడానికి వెనుక కారణం గూర్చి పరిశీలిస్తున్నట్లు పేర్కొంటూ, ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు నమోద కాలేదని తెలిపారు.అగ్ని ప్రమాదం సంఘటన మధ్యాహ్నం జరిగినట్లు సమాచారం అందుకొన్న వెంటనే క్షణాల్లో ఆ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోవడంతో మంటలని వెంటనే అదుపులోనికి తీసుకురావడం జరిగిందని, ఆయన తెలిపారు
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం







