గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- March 07, 2026
హైదరాబాద్: తెలంగాణ చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం మొదలైంది. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిల్మ్ అవార్డుల తుది జాబితాను జ్యూరీ చైర్మన్ మణిశర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రధాన పురస్కారాలు:
ఈ ఏడాది అత్యున్నత పురస్కారమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. అలాగే, సీనియర్ నటి జయసుధను ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వర రావు) అవార్డు వరించింది. మొత్తం 17 విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తున్నారు. సామాజిక సందేశాత్మక చిత్రాలతో పాటు డాక్టర్ సినారే పేరుతో కూడా ప్రత్యేక పురస్కారాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తుది జాబితా:
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌సినిమా టికెట్ల బుకింగ్
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి ఛాంపియన్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ అఖండ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చాంపియన్ – చంద్రకాంత్
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్)
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







