ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- March 07, 2026
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీని నియమించారని ఇటీవల కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ సమాచారం నిజం కాదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
ఇదిలా ఉండగా, కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మొజ్తబా ఖమేనీ పేరు ప్రకటిస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన కారణంగా ప్రభుత్వం మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే లీడర్లను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గతంలో కూడా కీలక పదవులు చేపట్టిన కొందరు లీడర్లపై దాడులు జరగడం ఈ భయాలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వ మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







