ఉష్ణోగ్రతల పెరుగుదలతో చేపల ధరలకు రెక్కలు
- August 01, 2016
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఖతారీ సముద్రజలాల్లో ఫిషింగ్ కష్టమవుతోంది. దాంతో, డిమాండ్‌కి తగ్గట్లుగా చేపలు దొరక్క దోహా సెంట్రల్ మార్కెట్‌లో చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. కింగ్‌ఫిష్ (చనాద్) ధర మామూలు రోజుల్లో కిలో 30 ఖతారీ రియాల్స్ ఉంటే, ఆ ధర ఇప్పుడు 52 ఖతారీ రియాల్స్‌కి పెరిగింది. హేమర్ ధర మామూలు సీజన్‌తో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. షారి ధర 15 నుంచి 18 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంది. ఇది మామూలుగా అయితే కేవలం 8 ఖతారీ రియాల్స్‌కే దొరుకుతుంది. సాఫి చేప ధర 35 నుంచి 55 ఖతారీ రియాల్స్‌కి పెరిగింది. సముద్రంలో చేపల వేట కష్టంగా మారిందనీ, వాతావరణ పరిస్థితులతో చేపలు సముద్రంలో దొరకడంలేదని ఫిషర్‌మెన్ చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు చేపల లభ్యత 50 శాతానికి పడిపోయిందని వారు వివరించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







