60 శాతం రోడ్లపై సర్వైలెన్స్ కెమెరాలు
- August 01, 2016
దోహాలోని 60 శాతం రోడ్లపై సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశామనీ, మిగతా రోడ్లపైనా వీటి ఏర్పాటు ప్రక్రియ జవేగంగా సాగుతోందని అధికారులు చెప్పారు. నేషనల్ కమాండ్ సెంటర్ - కంట్రోల్ రూమ్ (ఆపరేషన్స్ డిపార్ట్మెంట్) డైరెక్టర్ కల్నల్ సయీద్ హస్సన్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, దోహా వెలుపల అల్ ఖోర్, అల్ ష్రీహానియా, అల్ వక్రా, మెసైయీద్ తదితర ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన 999 సర్వీస్‌కి 80 శాతం ఫోన్‌కాల్స్, రోడ్లపై ప్రయాణించేవారు సెక్యూరిటీ సంబంధిత సమాచారం కోసమే వస్తున్నాయని కల్నల్ అల్ మజ్రోయి చెప్పారు. రోజూ 5000 నుంచి 6000 కాల్స్ వస్తుంటాయనీ, ఇందులో 20 శాతం ఎమర్జన్సీ కాల్స్ (రోడ్ యక్సిడెంట్స్, ఎమర్జన్సీస్, క్రిటికల్ కేస్లు) వస్తుంటాయని ఆయన వివరించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, తగలాగ్, ఉర్దూ, పాష్తో, బెంగాలి, పర్సియన్ తదితర భాషల్లో డిపార్ట్మెంట్ సేవలు అందిస్తోంది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







