ఒమాన్ లో మరో చిన్నారి కారుకి బలి!

- July 22, 2015 , by Maagulf
ఒమాన్ లో మరో చిన్నారి కారుకి బలి!


కారులో ఇరుక్కుపోయి, ఊపిరాడక మరణిస్తున్న చిన్నారుల మరణాల పరంపర ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆదివారం,  యారూబ్ అల్ జైదీ పేరుగల ఆరు సంవత్సరాల బాలుడి తల్లితండ్రులు, ఇంట్లో వారు అతిధులు వచ్చిన హడావిడిలో ఉండి, పిల్లలను సహాయకులకు అప్పగించారు. తన వరుస సోదరుడైన మరో ఐదేళ్ల బాలుడితో సహా తెరచి ఉన్న కారులో ప్రవేశించి, పొరబాటున లాక్ వేసేసుకున్నారు. రెండుగంటల అనంతరం, జైదీ మరణించగా, మరో బాలుడు చావుబ్రటుకుల మధ్య ఇబ్రి ఆసుపత్రిలోఊగిసలాడుతున్నాడు. ఏదైన కుట్ర జరిగింతుందనే కోణాన్ని ఇక్కడి పోలీసులు తోసిపుచ్చారు. ఇటువంటి దుస్సoఘటనలు ఎన్ని జరిగినా కళ్ళు తెరువని తల్లితండ్రులను నిందించాలో, ఆ దేవుని నిందించాలో తెలియని పరిస్థితి!


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com