వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!

- March 10, 2026 , by Maagulf
వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!

దోహా: రమదాన్ ను పురస్కరించుకొని ఈదియా ATM సేవలలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. QR200 డినామినేషన్ యాక్టివేషన్‌తో పాటు దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాలలో మొత్తం 43 ఈదియా ATMలను ఏర్పాటు చేసినట్లు QCB తెలిపింది.

ప్లేస్ వెండోమ్ మాల్ (8 ATMలు), మాల్ ఆఫ్ ఖతార్ (4 ATMలు), అల్ వక్రా ఓల్డ్ సౌక్ (4 ATMలు), దోహా ఫెస్టివల్ సిటీ (7 ATMలు), అల్ హజ్మ్ మాల్‌ (4 ATMలు), వెస్ట్ వాక్ (4 ATMలు), అల్ ఖోర్ మాల్ (4 ATMలు), అల్ మీరా (ముయిథర్) (4 ATMలు), అల్ మీరా (అల్ తుమామా) (4 ATMలు) లను ప్రారంభించనున్నారు.

ఈదియా ATM సేవలు  ఖతారీ వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షించే ప్రయత్నంలో భాగమన్నారు. రమదాన్ మాసం ఆధారంగా చిన్న పిల్లలకు డబ్బును బహుమతిగా ఇచ్చేందుకు ఈ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటలో తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com