చిన్నారుల్లో చెవుడుకు కారణాలు
- August 01, 2016
కొందరిలో పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిన మందులు, ఇన్ఫెక్షన్లు, పిండం అభివౄఎద్ధి చెందడంలో మార్పులు రావడం లాంటి కారణాల వల్ల లోపాలతో పుట్టవచ్చు. రుబెల్లా, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, సిఫిలిస్ (తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే వ్యాధి), హెర్పిస్ సింప్లెక్స్, గవదబిళ్లలు, తట్టు, మెదడువాపు లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చిన్నారుల్లో చెవుడుకు కారణమవుతాయి. ఇంకా మరికొన్ని కారణాలు తెలుసుకుందామా..- స్ట్రెప్టోమైసిన్, ఫ్రూసిమైడ్, జెంటామైసిన్ లాంటి మందులు,- రేడియేషన్, అ్రల్టాసౌండ్ లాంటి పరీక్షలు, ప్రసవ సమయంలో హైపోక్సియా, హైపర్‌బిలిరూబినిమియా (తల్లిదండ్రుల రక్తం సరిపడని కారణంగా వచ్చే వ్యాధి), -అతితక్కువ బరువుతో (15 వందల గ్రాముల కన్నా తక్కువ) పుట్టడం, - తల, మెడ, చెవి సరిగ్గా ఉండాల్సిన రీతిలో లేనప్పుడు, - కుటుంబంలో ఎవరికైనా చెవుడు ఉండటం , - డౌన్స్ సిండ్రోమ్, మార్ఫాన్స్ సిండ్రోమ్, గోల్డెన్ హార్స్ సిండ్రోమ్, పియరీ రాబిన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుసంబంధ వ్యాధులు చెవుడుకు కారణమవుతాయి. - ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా, ఆస్టియోస్క్లీరోసిస్ లాంటి ఎముకల వ్యాధి వల్ల చెవిలోని ఎముకల గొలుసులో కంపనాలు ఏర్పడవు. దానివల్ల శబ్దం లోపలి చెవికి చేరదు.- సెక్రిటరీ డైటిస్ మీడియా వల్ల మధ్యచెవిలో నీరు లేదా జిగురు లాంటి పదార్థం చేరుతుంది. శబ్ద ప్రకంపనాలు లోపలి చెవికి అందక సరిగ్గా వినపడదు.- వెలుపలి చెవి లేదా మధ్యచెవిలో గానీ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరి రంధం ఏర్పడుతుంది. తద్వారా వినికిడి శక్తి దెబ్బతింటుంది.- చెవికి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా కర్ణభేరి పగిలిపోవడమో, ఎముకల గొలుసు అస్తవ్యస్తం కావడమో జరుగుతుంది. తల ఎముకలు చిట్లిపోవచ్చు. ఇలాంటప్పుడు వినికిడి పోతుంది.- గింజలు, పూసలు, పుల్లల లాంటివి పిల్లలు తెలియక చెవిలో పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా వినికిడి పోయే ప్రమాదం ఉంది.పరిష్కారాలు:వెలుపలి చెవి పూర్తిగా లేని పిల్లల్లో మధ్యచెవి, లోపలి చెవి సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు పరిశీలిస్తారు. అవి బాగానే ఉంటే ప్లాస్టిక్ సర్జన్, ఇఎన్‌టి సర్జన్ కలిసి బయటిచెవిని, చెవినాళాన్ని కౄఎత్రిమ పదార్థాలతో గానీ, శరీరంలోని ఇతర పదార్థాలతో గానీ రూపొందించి శబ్దం మధ్యచెవికి అందేవిధంగా చేస్తారు. తద్వారా వినగలుగుతారు. చెవిలో పెట్టుకునే గింజలు, పూసలు, పిన్నులు, దూది, స్పాంజి, పెన్సిల్ ముక్కలు, లేదా కీటకాలు చేరడం వల్ల వినికిడి తగ్గిపోతు ముందుగా కర్ణభేరికి అపాయం కలుగకుండా వాటిని బయటకు తీస్తారు. ఇలాంటప్పుడు ఏమాత్రం అజాక్షిగత్తగా ఉన్నా వినికిడి శక్తి మొత్తం పోవచ్చు. చెవిలో ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు సకాలంలో మందులు వేయడం, డ్రెస్సింగ్ చేయడం జరగాలి.కొన్నిసార్లు చెవిలో అదనంగా కండరాలు పెరుగుతాయి. వీటిని మైక్రోసర్జరీ ద్వారా తొలగిస్తే వినకిడి శక్తి వస్తుంది. ఆటోస్క్లీరోసిస్ లాంటి వ్యాధి వల్ల చెవిలోని ఎముకలు బిగుసుకుపోయినప్పుడు, చెవిలో రంధం పడినప్పుడు కూడా మైక్రోసర్జరీ అవసరం అవుతుంది. మధ్యచెవిలో నీరు చేరితే (సెక్షికిటరీ ఓటైటిస్ మీడియా) ఆ ద్రవాన్ని కర్ణభేరి ఆపరేషన్ ద్వారా బయటకు తీసేస్తారు. ఆపరేషన్ తరువాత మళ్లీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వరకు కర్ణభేరిలో ఒకరకమైన బటన్‌ను ఉంచుతారు. దీనివల్ల మధ్యచెవిలో తయారయ్యే ద్రవం బయటకు వెళ్లిపోతుంది. దీన్ని మెరింగాటమీ, గ్రొమెట్ ఆపరేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసినా చెవిలో ద్రవం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కారణాన్ని పరీక్షించి తదనుగుణమైన చికిత్స అందించాలి. మధ్యచెవిలో ద్రవం ఏర్పడటానికి యూస్టేషియన్ నాళానికి సంబంధించిన వ్యాధులు, ఎడినాయిడ్స్, ముక్కు వెనకాల ఉండే టాన్సిల్స్ లాంటి కండరాలు, సైనసైటిస్, టాన్సిల్స్,క్లఫ్ పాలెట్ మొదలైనవి ముఖ్యమైన కారణాలు. వీటన్నింటినీ సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







