ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!

- March 12, 2026 , by Maagulf
ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!

దోహా: ఖతార్ మార్కెట్లలో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డిమాండ్‌ను తీర్చగల సురక్షితమైన వ్యూహాత్మక నిల్వలను కలిగి ఉన్నాయని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగించడంలో, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో మంత్రిత్వ శాఖ చురుకైన పాత్రను పోషిస్తుందని మంత్రిత్వశాఖలో మార్కెట్ నియంత్రణ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ ముబారక్ అల్-అమెరి తెలిపారు.

ఖతార్‌లో రోజువారీ నిత్యావసర వస్తువుల లభ్యతను అంచనా వేయడానికి దోహా అంతటా అనేక మాల్స్ మరియు దుకాణాలను సందర్శిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసర వస్తువులతో సూపర్ మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ పూర్తి స్థాయిలో స్టాక్ ఉందన్నారు.
ధరల కదలికలను రోజువారీగా పర్యవేక్షించడం మరియు మార్కెట్లలో తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేయడం గురించి డాక్టర్ అల్-అమిరి  హైలైట్ చేశారు. మార్కెట్లలో నిత్యవసరాల నిల్వలు మరియు  వ్యూహాత్మక నిల్వలు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సరిపోతాయని తెలిపారు. నిత్యవసరాల వస్తువలు స్టాక్ పై పుకార్లను వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఉల్లంఘనలను మంత్రిత్వ శాఖ హాట్‌లైన్ 16001 ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా దాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నివేదించవచ్చని సూచించారు.  

డాక్టర్ అల్-అమిరి మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ సహకారంతో తనిఖీ ప్రచారాలు 24/7 కొనసాగుతున్నాయని ధృవీకరించారు. మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు సరఫరా అంతరాయాలను నివారించడానికి దిగుమతి వనరులను వైవిధ్యపరచడంలో మంత్రిత్వ శాఖ కూడా చురుకుగా పనిచేస్తోందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com