అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ

- August 01, 2016 , by Maagulf
అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ

నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్రీయ విద్యాలయం సంఘటన న్యూఢిల్లీ నుంచి జిల్లా అధికారులకు లేఖ అందినట్లు అమరావతి డెవలప్‌మెంట్‌ ఆధారిటి చైర్మన జాస్తి వీరాం జనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం సంఘటన సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ ఇ ప్రభాకర్‌ నుంచి హైదరాబాదులోని ప్రాంతీయ కార్యాలయానికి వివరాలు పంపాలని లేఖ పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం నాలుగు ఎకరాలు స్థలాన్ని గురించి ఢిలీల్లోని హెచఆర్‌డీ సంయుక్త కార్యదర్శికి పంపాలని కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, డీఆర్వో నాగబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తాను పాఠశాల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వీరాంజనేయులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com