ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్‌ల అరెస్టు..!!

- March 12, 2026 , by Maagulf
ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్‌ల అరెస్టు..!!

మనామా: ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కోసం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు బహ్రెయిన్ జాతీయులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఒకరు విదేశాలలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపింది.

దర్యాప్తులో మొదట అరెస్టు అయిన వ్యక్తి సూచనలను అనుసరించి..బహ్రెయిన్‌లోని ముఖ్యమైన ప్రదేశాల కోఆర్డినేట్‌లను రికార్డ్ చేయడానికి హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీని ఉపయోగించినట్టు మిగతా వారు తెలిపారు.ఈ సమాచారం ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా IRGCకి పంపినట్టు గుర్తించారు. అరెస్టు చేసిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపారు.
ప్రజల భద్రతను కాపాడటానికి మరియు చట్టపరమైన పరిణామాలను నివారించడానికి అధికారిక వనరుల నుండి సమాచారాన్ని పొందాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ధృవీకరించని వీడియోలు లేదా వార్తలను తిరిగి పోస్ట్ చేయవద్దని హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com