ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

- March 13, 2026 , by Maagulf
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా విశేష సేవలు అందించిన ఆమె, ఇప్పుడు ఏపీ హైకోర్టు నాయకత్వం వహించబోతున్నారు. సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com