ఇక ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌

- March 13, 2026 , by Maagulf
ఇక ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు, డీలర్లకు రవాణా శాఖ శుభవార్త తెలిపింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్‌లో అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత పద్ధతికి స్వస్తి పలికి, నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలంగాణ రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్లు ఎలాంటి ఫిజికల్‌ పత్రాలనూ ఆర్టీఏ కార్యాలయాలకు పంపకూడదు. యజమాని సంతకాలతో కూడిన ఫాం-20, ఇతర పత్రాలను స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈనెల 13వ తేదీకి ముందు టెంపరరీ రిజిస్ట్రేషన్‌ పొందిన వాహనాలకు కూడా ఈ ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com