రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- March 13, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా రేషన్ కార్డు సేవలను పూర్తిగా సరళతరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లేదా రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ‘ఉమాంగ్’ యాప్‌లో ‘మేరా రేషన్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదారులు తమ మొబైల్ నుంచే రేషన్ సంబంధిత సమాచారాన్ని పొందే వీలు కలిగింది.
ఒకే యాప్‌లో అనేక సేవలు
‘మేరా రేషన్’ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఈ క్రింది సేవలను సులభంగా పొందవచ్చు:
- కొత్త కార్డు దరఖాస్తు: కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.
- కార్డు స్టేటస్: దరఖాస్తు చేసుకున్న కార్డు ఏ స్థితిలో ఉందో ట్రాక్ చేయవచ్చు.
- స్టాక్ వివరాలు: మీకు ఎంత రేషన్ కేటాయించారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు.
- దుకాణాల గుర్తింపు: మీ నివాసానికి సమీపంలో ఉన్న రేషన్ షాపుల చిరునామాలను మ్యాప్ ద్వారా గుర్తించవచ్చు.
దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.గత లావాదేవీల హిస్టరీని చూడవచ్చు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









