90 సెకన్లలో రూ.15 లక్షలు దోచేశారు
- August 01, 2016
సినిమాల్లో మాదిరిగానే ఓ ఇన్సిడెంట్ రియల్‌గా జరిగింది. పక్కాగా స్కెచ్ వేసి పని పూర్తి చేసి వెళ్లిపోవడం ఆ ముఠా వంతైంది. కేవలం 90 సెకన్లలో బ్యాంకుని దోపిడీ చేసింది ఓ ముఠా. కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేశారు. 90 సెకన్లలో పంజాబ్‌లోని లూథియానాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ.15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది.
ఆ బ్రాంచి పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే టైమ్‌కి బ్యాంక్‌లో ఓ కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే, కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తొలుత దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ బ్యాంక్ లోపలకు ప్రవేశించారు. ఇద్దరు దొంగలు లాబీలో వుండగా, ఒకడు కౌంటర్ లోవున్న క్యాషియర్ తుపాకి గురిపెట్టాడు. మరొకడు మేనేజర్‌ను బంధించగా, నాలుగో వ్యక్తి కొద్ది నిమిషాల కిందట కస్టమర్ డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు దోపిడీ చేసేశాడు. ఎట్ ద సేమ్‌టైమ్ పని నిమిత్తం బ్యాంక్ లోపలకు వస్తున్న ఓ మహిళ.. ఈ తతంగాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లి అందరికీ విషయం చెప్పింది.
చుట్టుపక్కల వాళ్లు స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ యవ్వారం అంతా కేవలం 90 సెకన్ల వ్యవధిలో జరగడం గమనార్హం. దోపిడీ ఎలా జరిగింది అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. సీసీకెమెరాల్లో దొంగలు ముసుగు ధరించినట్టు క్లియర్‌గా వుంది. ఈ దోపిడీలో ఉద్యోగుల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు వున్నారన్న ఈ విషయం దోపిడీ ముఠాకు ఎలా తెలిసింది? సెక్యూరిటీ గార్డ్ ఎందుకులేడు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







