ఆగస్టు 12న విడుఅలాకానున్న జనతా గ్యారేజ్ ఆడియో
- August 02, 2016
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ జనతా గ్యారేజ్. షూటింగ్ మొదలైనప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావన్న ఉద్దేశంతో వాయిదా వేశారు.అయితే ఎప్పటి నుంచో ఆగస్టు 12 మీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరచకూడదని.. అదే రోజు ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేశాడు జూనియర్. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







