'కాత్రు వెలియిదై' చిత్రం కోసం భయంకరమైన ఇంటిని హాస్పిటల్ గా మార్చేశారు

- August 02, 2016 , by Maagulf
'కాత్రు వెలియిదై' చిత్రం కోసం భయంకరమైన ఇంటిని హాస్పిటల్ గా మార్చేశారు

దర్శకుడు మణిరత్నం, కార్తీ, అతిదిరావు ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'కాత్రు వెలియిదై'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఊటీలో చిత్రీకరిస్తోన్నా.. కాశ్మీర్ ను తలపించే విధంగా సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాలో కార్తీ ఓ పైలట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి విదితమే. అయితే సినిమాలో కార్తికి గాయం కావడంతో హాస్పిటల్ లో చేర్పిస్తారు. ఈ హాస్పిటల్ సన్నివేశాల కోసం ఊటీకి 10,15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ భయంకరమైన ఇంటిని మణిరత్నం ఓ హాస్పిటల్ గా మార్చేశాడు. ఆ హాస్పిటల్ లో కార్తిని ట్రీట్ చేసే డాక్టర్ గా అదితిరావు కనిపించనుంది. ప్రస్తుతం ఆ హాస్పిటల్ కానీ హాస్పిటల్ లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com