అబుదాబిలో ఇండియన్స్ అష్టకష్టాలు

- August 02, 2016 , by Maagulf
అబుదాబిలో ఇండియన్స్ అష్టకష్టాలు

సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలను భారత ప్రభుత్వం పట్టించుకోవాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత ఎన్ కే ప్రేమచంద్రన్ డిమాండ్ చేశారు. కొంతమంది భారతీయ పౌరులు అబుదాబిలో అష్టకష్టాలు పడుతున్నారని, వారంతా రువాయిస్ అనే క్యాంపులో ఉంటూ నానా కష్టాలు పడుతున్నారని చెప్పారు.గత ఎనిమిది నెలలుగా ఆ కంపెనీ కేవలం పనిమాత్రమే చేయించుకుంటుందని, వారికి జీతభత్యాలు చెల్లించడం లేదని, కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని వెంటనే కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకొని పరిష్కరించాలని అన్నారు. అక్కడి అధికారులకు ఫిర్యాదుచేసినా, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com