ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- March 20, 2026
మనామాః ఒక హోటల్ మరియు సూపర్ మార్కెట్‌లో ఫేక్ కరెన్సీని ప్రోత్సహించినందుకు మరియు ఉపయోగించినందుకు, బహ్రెయిన్‌కు చెందిన ఒక యువకుడికి హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రెండు ప్రదేశాలలోని ఉద్యోగులు నకిలీ నోట్లను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ కరెన్సీ నకిలీదని తనకు తెలియదని, అప్పు తీర్చడానికి మరొక వ్యక్తి ఆ నోట్లను ఇచ్చాడని నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, నిందితుడు ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకుని, 20 బహ్రెయిన్ దినార్ల నోటుతో చెల్లించి, చిల్లరగా 10 దినార్లు పొందడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఆ నోట్లపై అనుమానం వచ్చిన రిసెప్షనిస్ట్, హోటల్ యజమానికి తెలియజేయగా, అది ఫేక్ కరెన్సీ అని నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత, నిందితుడు మరో 20-దినార్ల నకిలీ నోటుతో వస్తువులు కొనడంతో, ఒక సూపర్ మార్కెట్ ఉద్యోగి కూడా ఇలాంటి ఫిర్యాదే చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో అతని కదలికలను గమనించి అరెస్టు చేశారు. అయితే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆ రెండవ వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!









