పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- March 20, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గఅభివృద్ధి ద్యేయoగా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజలమనిషిగా మన్ననలు పొందిన దీశాలి ఎంపీ బాలసౌరి అనడంలో అతిశయోక్తి లేదు.నిరంతరం ప్రజలకు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ సర్వేకి కృషిచేసి నిధులు మంజూరు అయ్యేలా చేయడం, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లో విలీనమైన తర్వాత ఆంధ్ర ప్రజల గుండె చప్పుడును గ్రహించి ఆంధ్ర బ్యాంకు నిర్మాత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో 40 కోట్ల రూపాయల విలువ చేసే స్మారక భవనాన్ని నిర్మించేలా యూనియన్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడి, నిధులు మంజూరు చేశారు. కానీ మున్సిపల్ నగరపాలక సంస్థ లో ఎప్పటికప్పుడు బిల్లును అడ్డుకుంటూ వైసీపీ నేతలు చేసిన ఆగడాలకు ఎంపీ బాలశౌరి చెక్ పెట్టారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిన గంటల వ్యవధిలోనే పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదించేలాగా అధికారులతో మాట్లాడి పరిపాలన అనుమతులు తీసుకురావడం పట్ల ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వేసిన చలోక్తులు నిజం చేస్తూ రెండు అడుగులు వెనక్కు వేసినంత మాత్రాన విజేత పోటీలో ఓడిపోవడం కాదని 20 అడుగులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నమని ఈ ఘటనతో ఎంపీ బాలశౌరి నిరూపించారు. మంచివారి మౌనం వెనుక అనేక రాజనీతి ఆలోచనలు ఉంటాయని ఎంపీ బాలసౌరి మరోసారి నిరూపించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







