అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- March 20, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఈద్ అల్-ఫితర్ ను ఘనంగా జరుపుకుంది. కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్‌లోని అల్ ఖోర్ మసీదులో పవిత్రమైన ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు చేశారు.
ఈ ప్రార్థనలలో సుల్తాన్ తో పాటు పలువురు రాజకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితోపాటు సుల్తాన్ సాయుధ దళాల (SAF), రాయల్ ఒమాన్ పోలీస్ (ROP) మరియు ఇతర సైనిక, భద్రతా సేవల కమాండర్లు, ఇస్లామిక్ దేశాల దౌత్య కార్యాలయాల అధిపతులు, మస్కట్ గవర్నరేట్ నుండి స్టేట్ కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ సభ్యులు, అండర్ సెక్రటరీలు, షేక్‌లు, వ్యాపారవేత్తలు మరియు సీఈఓలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఎండోమెంట్స్ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ సయీద్ అల్ మామారి ఈద్ ప్రసంగాన్ని ప్రారంభించారు. పవిత్ర రమదాన్ మాసం, ఖురాన్ మరియు ఈద్ పండుగ మధ్య ఉన్న విడదీయరాని సంబంధాలపై ఈద్ ప్రసంగం కొనసాగింది.
ప్రార్థనలు ముగిసిన తర్వాత కింగ్ సుల్తాన్ అల్ అలమ్ ప్యాలెస్‌కు బయలుదేరారు. ఆయన వెళుతున్నప్పుడు సుల్తాన్ గౌరవార్థం ఆర్టిలరీ ఇరవై ఒక్క ఫిరంగులతో గౌరవ సూచకంగా కాల్పులు జరిపింది. అల్ అలమ్ ప్యాలెస్ ప్రాంగణానికి చేరుకున్న సుల్తాన్.. ప్రముఖల నుంచి ఈద్ శుభాకాంక్షలు స్వీకరించారు. అనంతరం దేశంలోని పౌరులు, నివాసితుతులు, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







