ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- March 21, 2026
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం విద్యాశాఖలో పెను సంచలనం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ సంఘన చోటు చేసుకోవడంతో విధుల్లో ఉన్న 9 మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, పరీక్షా కేంద్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇకపై పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లను ట్రాకింగ్ చేసే విధానం తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
దీంతో పరీక్షా కేంద్రాల్లోకి ఎవరైనా ఫోన్ తీసుకొచ్చి స్విచ్ ఆఫ్ చేసినా గుర్తిస్తామని, పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు నిషేధమని విద్యాశాఖ స్పష్టం చేసింది. తాజా ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో క్లర్క్‌లు, రిజర్వ్‌లో ఉన్న ఇన్విజిలేటర్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే కూర్చొని ఉండాలి. విద్యార్థుల వద్దకు, కారిడార్లలో తిరగరాదని విద్యాశాఖ పేర్కొంది. క్లర్క్‌లుగా పాఠశాల సబ్జెక్టు టీచర్లను నియమించరాదు. తప్పనిసరిగా జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే నియమించుకోవాలి.
హాల్‌టికెట్ నంబర్లను ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై తప్పనిసరిగా విద్యార్థులతో రాయించాలని ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది పరీక్షాకేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండరాదు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం క్లోక్ రూమ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి అక్రమాలకు పాల్పడితే సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







