మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- March 21, 2026
మస్కట్: ఒమన్ సుల్తాన్ సతీమణి, గౌరవనీయ మహారాణి సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకునే మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒమన్ సుల్తానేట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు.
ప్రతి సంవత్సరం మార్చి 21న వచ్చే మాతృ దినోత్సవం సందర్భంగా ఒమన్, ప్రపంచంలోని నలుమూలల ఉన్న ప్రతి తల్లికి మా అత్యంత హృదయపూర్వక ప్రశంసలను మరియు కృతజ్ఞతలను తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
మన గొప్ప తల్లులు సహనం, భక్తి, నిస్వార్థం, త్యాగం మరియు అంతులేని దాతృత్వం గురించి మనం స్మరించుకోవడానికి ఈ ఒక్క రోజే సరిపోదని, ఈ భావాలు మన జీవితంలోని ప్రతి రోజూ మన హృదయాల్లో మరియు మన మాటల్లో సదా నిలిచి ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







