ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- March 23, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా (హోంశాఖ), రాజ్ నాథ్ సింగ్ (రక్షణ శాఖ), జైశంకర్ (విదేశాంగ శాఖ), హర్దీప్ సింగ్ పూరీ, నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ) ఇతర సీనియర్లు హాజరయ్యారు. పెట్రోలియం, క్రూడాయిల్, గ్యాస్, పవర్, ఎరువుల రంగాలపై మోదీ సమీక్ష చేశారు.
లాజిస్టిక్స్ వ్యవస్థ స్థిరంగా కొనసాగడంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ఇంధనం, విద్యుత్, ఎరువుల పంపిణీలో ఆటంకం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. మరోవైపు నిత్యవసర వస్తువుల సరఫరా, ధరల స్థిరీకరణపై సమీక్ష చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించింది. హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య మార్గానికి అంతరాయం ఏర్పడింది.
హైలెవల్ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చ..
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించింది. ఇది పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమపై దాడులను ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ (86) హత్యకు గురయ్యాడు.
పశ్చిమ ఆసియా సంఘర్షణ మూడు వారాలుగా కొనసాగుతోంది. ఇరాన్‌లోని వ్యూహాత్మక గ్యాస్ క్షేత్రాలైన సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎన్జి గ్యాస్ ఫీల్డ్ రాస్ లఫాన్తో సహా పలు గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ తీవ్ర ప్రతీకార చర్యలకు దిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించింది.
మరోవైపు హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన కంట్రోల్ లోకి తీసుకుంది. నౌకల రవాణను అడ్డుకుంది. దీంతో గ్యాస్ సంక్షోభం నెలకొంది. చాలా దేశాల్లో తీవ్రమైన ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ పరిణామాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచేశారు. లీటర్ కు రూ. 87.67 నుంచి రూ. 109.59 కు అంటే 25 శాతం పెరిగాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడారు.
తాజా వార్తలు
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!









