కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్‌ పై డ్రోన్ దాడి..!!

- March 25, 2026 , by Maagulf
కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్‌ పై డ్రోన్ దాడి..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక ఇంధన ట్యాంక్‌ లక్ష్యంగా డ్రోన్‌ దాడి జరిగిందని, ఫలితంగా అక్కడ అగ్నిప్రమాదం సంభవించిందని కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.

ప్రాథమిక నివేదికల ప్రకారం కేవలం ఆస్తి నష్టానికే పరిమితమైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.

అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ను వెంటనే అమలు చేశామని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు వేగంగా రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఘటన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com